కొవ్వాడ అణువిద్యుత్‌ ఉత్పత్తికి ఎన్నో సవాళ్లు!

అందరి చూపు కొవ్వాడ వైపు

nuclear power generation
nuclear power generation

కొవ్వాడ ప్రపంచ పటంలో గుర్తింపు పొందింది. ఊళ్లకు ఊళ్లు ఖాళీ. రెక్కల కష్టంతో బతికే స్థానిక గ్రామీణుల గుండెలలో అణువిద్యుత్‌ కేంద్రాలు గుబులు సృష్టించాయి.

నిర్వాసితులుగా జీవనవేదన, కన్నీళ్లు, అణువిద్యుత్‌ కేంద్రాలు సృష్టించే మృత్యుప్రమాద బీభత్సం కొవ్వాడ సముద్ర తీరంలోని బీచ్‌లో ఆగ్రహోద్యమం తలెత్తింది.

విశాఖలో వెల్లువెత్తింది. నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు ఊపందుకొన్నాయి.

స్వచ్ఛంద సేవా సంస్థ హ్యుమన్‌ రైట్స్‌ఫౌరమ్‌, వామపక్ష పార్టీల కార్యకర్తలు,పర్యావరణ ప్రేమికులు, పౌరహక్కుల సంఘాల నేతలు గ్రామగ్రామాన ఉద్యమ సారధ్యం వహించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రకృతి, అపార సంపదను ప్రసాదించింది.

జాతీయస్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ సౌభాగ్యా నికి పారిశ్రామిక, సాంకేతిక పురోగ తికి అత్యంత ప్రధానమైన విద్యుత్‌ ఉత్పత్తికి, శక్తికి అవసరమైన సహజ వనరులను అన్వేషిస్తోంది.

బొగ్గు, చమురు, సహజవాయువ్ఞ, సౌర,పవన, జల వనరుల సద్విని యోగంతోపాటు,ప్రపంచ దేశాలు, అతి తక్కువశాతం అణువిద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి సాధిస్తున్నాయి.

అణుశక్తిని శాంతి ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి అత్యవసరమైన యురేనియం భూగర్భ ముడిఖనిజం రెండు రాష్ట్రాలలో సమృద్ధిగా లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

జాతీయస్థాయిలో ప్రస్తుతం ఉన్న 22 అణువిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు అదనంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఆరు ఆణురియాక్టరుల స్థాపన గత దశాబ్దంగా, అంతర్జాతీయ అణు సంబంధిత పౌర సహకార ఒప్పందాల అమలులో కీలకమైంది.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో తూర్పున సముద్ర తీర ప్రాంతంలోఉన్న పెద్ద కొవ్వాడ,చిన్న కొవ్వాడ, రామచంద్రాపురం, గూడెం, కోటపాలెం, టెక్కలి, జీరు కొవ్వాడ వంటి గ్రామాలలో చిన్నసన్న రైతాంగం సముద్ర తీరాలలో చేపలు పట్టి జీవించే మత్స్యకార్మికులు జీవనోపాధి సాగిస్తుంటారు.

కొబ్బరి,అరటితోటలు నలుమూలలా పచ్చదనం దర్శనమిచ్చే ఆ ప్రాంతాలు అణువిద్యుత్‌ కర్మాగారాల విద్యుత్‌ వెలుగులు విరజమ్మాలని భారత అణు విద్యుత్‌ సంస్థ నిర్ణయించింది.

అణువిద్యుత్‌ ఉత్పత్తి ప్రస్తుతం ఉన్న అతి తక్కువ 2.1శాతం వినియోగం నుంచి మరింత పెంచా లని కేంద్రం సంకల్పించింది.

కొవ్వాడలో 1594మెగావాట్ల ఉత్పత్తి చేయగల ఆరు రియాక్టరులు మొత్తం 9,564 మెగావాట్ల గరిష్ట తుది సామర్థ్యం తీర్చిదిద్దాలనే అతిభారీ ప్రణాళిక కార్యరూపం దాల్చవలసి ఉంది.

మొత్తం 2475 ఎకరాల బృహత్‌ ప్రాజెక్టులో రియాక్టరులు,పునరావాస కాలనీ, ఉద్యోగుల టౌన్‌షిప్‌, శ్రీకాకుళం జిల్లా స్వరూప స్వభావాలను మార్చివేయగలవు.

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అయిదేళ్లనాటి స్వప్న సాఫల్యం కోసం కలలు కంటోంది.

అమెరికా టెక్నాలజీతో 10వేల మెగావాట్లు అణువిద్యుత్‌ ఉత్పత్తికి 2005-2008 సంవత్సరాలలో సివిల్‌ న్యూక్లియర్‌ సహకార ఒప్పందాలలో భాగంగా నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

2009లో కేంద్ర అణుశక్తి విభాగం వైట్‌వాటర్‌ రియాక్టర్లతో విద్యుత్‌ ఉత్పత్తి నిర్ణయం తీసుకొన్నా ఆరేళ్ల జాప్యంతో 2015విధాన కార్యాచరణ ఆరంభమైంది.

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, అమెరికాలోని వెస్టింగ్‌ హౌస్‌తో చేతులు కలిపి రూ.60కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించి కొవ్వాడ కార్యస్థానం చేసింది.

2012 నవంబరు ఒకటిన ఉమ్మడి రాష్ట్రంలోని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రాల స్థాపనకు భూసేకరణ ఉత్తర్వు జారీ చేసింది.

కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో తెలుగు దేశం ప్రతిపక్ష పార్టీలుగా అభ్యంతరాలు లేవనెత్తినా, తరువాత కేంద్రంలో, రాష్ట్రంలో అధికార పార్టీలుగా అణువిద్యుత్‌ ప్రాధాన్యత గుర్తించాయి.

2015 జనవరిలో భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ఒబామాల పౌర అణుఒప్పందం ఖరారైంది.

2017 జూన్‌లో న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, అమెరికా రియాక్టర్‌ల నిర్మాణ దిగ్గజ సంస్థ వెస్టింగ్‌ హౌస్‌తో, సంయుక్తంగా కొవ్వాడలో విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి అంగీకార ఒప్పందం కుదిరింది.

జపాన్‌ కంపెనీలైన హిటాచి, తోషిబా, మిట్సుబిషి వంటి యాజమాన్యసంస్థలకు అమెరికాలోని అమెరికన్‌ బడా సంస్థలు జి.యి, వెస్టింగ్‌ హౌస్‌, అరెవావంటి కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలతో నిర్మాణ అనుసంధాన భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.

ఆ విధంగా కొవ్వాడ ప్రపంచ పటంలో గుర్తింపు పొందింది. ఊళ్లకు ఊళ్లు ఖాళీ. రెక్కల కష్టంతో బతికే స్థానిక గ్రామీణుల గుండెలలో అణువిద్యుత్‌ కేంద్రాలు గుబులు సృష్టించాయి.

నిర్వా సితులుగా జీవన వేదన,కన్నీళ్లు, అణువిద్యుత్‌ కేంద్రాలు సృష్టించే మృత్యుప్రమాద బీభత్సం కొవ్వాడ సముద్ర తీరంలోని బీచ్‌లో ఆగ్రహోద్యమం తలెత్తింది. విశాఖలో వెల్లువెత్తింది. నిరసన ప్రద ర్శనలు, నిరాహారదీక్షలు ఊపందుకొన్నాయి.

రాజకీయ పార్టీలు తేలుకుట్టిన దొంగలుగా వ్యవహరించినా స్వచ్ఛంద సేవా సంస్థ హ్యుమన్‌ రైట్స్‌ఫౌరమ్‌, సిపిఐ (ఎమ్‌) సిపిఐ వంటి వామపక్ష పార్టీల కార్యకర్తలు,పర్యావరణ ప్రేమికులు, పౌరహక్కుల సంఘాల నేతలు గ్రామగ్రామాన ఉద్యమ సారధ్యం వహించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూడా కొవ్వాడలో నిరసనోద్యమంలో పాల్గొ న్నారు.

సీనియర్‌ సి.పి.ఎమ్‌ నేత ప్రకాష్‌కారత్‌ గ్రామాలలో నిరస నోద్యమాలలో పాల్గొన్నారు.2017 అణువిద్యుత్‌ కర్మాగాల వ్యతిరే కత ఉవ్వెత్తున లేచింది.

ఇంతలో మరొక అవరోధం వెస్టింగ్‌ హౌస్‌ నిర్మాణ సంస్థ దివాలా వ్యవహారం. భారత అణు నియంత్ర మండలి మాజీ ఛైర్మన్‌ ఇలాంటి పరిస్థితులలో ముందుకెళ్లడం అనర్ధదాయకమన్నారు.

కేంద్ర విద్యుత్‌శాఖ మాజీ కార్యదర్శి ఇ. ఎ.ఎస్‌శర్మ ఎన్నో అస్థిర అంతర్జాతీయ వివాదాలు, అనుమానాలు తలెత్తినా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

అణుభద్రతా చట్టం రియాక్టరుల సరఫరాదారులు వ్యతిరేకించడం ప్రజాజీవనానికి ప్రాణహాని కలిగిస్తుందని ఈ ప్రాజెక్టు విరమించాలని ఎందరో మేధావులు హెచ్చరిస్తున్నారు.

కాని పునరాలోచన ఏమీ లేదని ప్రజాసహకారంతో ముందుకు వెళ్తామని భారత అణువిద్యుత్‌ సంస్థ ఉన్నతాధికారి, కొవ్వాడ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.వి రమేష్‌ స్పష్టం చేస్తున్నారు.

ఈ గందర గోళం త్వరలో పూర్తిగా సర్దుబాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్థిర నిశ్చయంతో ఉంది.

భారతదేశపు జవాబుదారీ చట్టం సెక్షన్‌ 17(బి), సెక్షన్‌ 46 ప్రకారం (2010 సివిల్‌ లయబిలిటి- న్యూక్టి యర్‌ డేమేజ్‌ చట్టం) అణు రియాక్టరుల సరఫరా సంస్థలు, అణు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో ఒకవేళ ఘోర ప్రమాదాలు జరిగితే చట్టరీత్యా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

2032 నాటికి 55 రియాక్టరుల ద్వారా 63వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్న భారత ప్రభుత్వం ఇండో, యుఎస్‌ న్యూక్లియర్‌ ఒప్పందం అమలులో ఎన్నో అవరోధాలు, అనుమానాలు, ఆంక్షలు ఎదుర్కోవలసి వస్తోంది.

2011 మార్చిలో జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రంలో జరిగిన పెను ప్రమాదం, ప్రపంచంలో అణువిద్యుత్‌ ఉత్పత్తికి భయాందోళనలు రేకెత్తిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ అవస రాలలో కేవలం 11శాతాన్ని అణువిద్యుత్‌ కేంద్రాలు, తీర్చగలుగు తున్నాయి.

మనదేశంలో 1987లో ఏర్పాటైన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎన్ని అవరోధాలు,ఆంక్షలుఅడ్డగోడలు, పరిమితులు అనుమానాలు ఎదురైనా అణువిద్యుత్‌ రంగంలో వెనుకడుగు వేయదలచుకోలేదు.

ప్రపంచంలో ప్రస్తుతం 12వస్థానం లో ఉన్న మనదేశం తారాపూర్‌, నరోవా, రానత్‌భట్‌, కాక్రపార, కైగా,కల్పక్కం, కుడంకుళం ప్రధాన అణువిద్యుత్‌ కేంద్రాలున్నాయి.

ప్రస్తుతం దేశంలో 6780 మెగావాట్లు (1.89శాతం) అణువిద్యుత్‌ ఉత్పత్తి చేయగలుగుతున్నాయి.

2021-22 నాటికి అదనంగా 6,700 మెగావాట్లు సాధించే ప్రణాళికలు చురుకుగా సాగుతున్నాయి. కాని కొవ్వాడ తొలిదశలోని రెండు అణురియాక్టర్లకయ్యే వ్యయం అంచనా రూ. 48,320 కోట్లు తడిసిమోపెడు అయ్యే పరిస్థితి తలెత్తింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ 2020లో రెండుదేశాలకు సంబంధించిన ఒప్పందా లలో దివాలాతీసిన వెస్టింగ్‌ హౌస్‌ సంస్థతో, కొవ్వాడలో నిర్మిం చవలసిన విద్యుత్‌ కేంద్ర నిర్మాణాలు తప్పక పూర్తి చేసే వాగ్దానం కూడా ఉంది.

భారతదేశ అణుపాటవ సామర్థ్యం పెంపుదలకు క్లింటన్‌ వైట్‌హౌస్‌ కాలం నుంచి అమెరికా అవరోధాలు సృష్టిస్తూనే ఉంది.

భారతదేశానికి అణుసాంకేతికత బదలాయింపులో, సరఫరా దారునిపై న్యూక్లియర్‌ డేమేజ్‌ సందర్భంలో తలెత్తిన పౌరజవాబు దారీ చట్టం అమెరికాలోని బడా కార్పొరేట్‌ నిర్మాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.

దానికితోడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వెస్టింగ్‌హౌస్‌ దివాలా బాటపట్టడంతో దాని యాజమాన్యం జపాన్‌ తోషిబా, 2017మేలో దివాలా పిటిషన్‌ వేయించింది.

2018లో బ్రూక్‌ఫీల్డ్స్‌ బిజినెస్‌ పార్ట్నర్స్‌ సంస్థ వెస్టింగ్‌ హౌస్‌ను ఆదుకొని స్వాధీనం చేసుకోవడంతో వెస్టింగ్‌హౌస్‌ మళ్లీ రంగంపైకి వచ్చింది.

నేటికీ ప్రకృతి,పర్యావరణం,అణువిద్యత్‌ను వ్యతిరేకించే స్వచ్ఛంద సేవాసంస్థలు,నిరుపేదల జీవన మానవహక్కుల పోరాట సంస్థలు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమాలు, పోరాట ప్రతిఘటన, ఆందోళను వ్యతిరేకతలు ఉండనే ఉన్నాయి.

  • జయసూర్య, సీనియర్‌ జర్నలిస్టు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/