జమ్ము‌క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము రాజీనామా

manoj sinha

న్యూఢిల్లీ : జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ జ‌మ్ముక‌శ్మీర్ గ‌వ‌ర్న‌ర్‌గా సిన్హాను నియామ‌కం చేస్తూ ఉత్త‌ర్వులిచ్చారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి గిరీష్ చంద్ర ముర్ము రాజీనామా చేశారు. ముర్ము రాజీనామాను రాష్ర్ట‌ప‌తి ఆమోదించారు. కాగా, నూతన ‘కం‌ప్ర్టో‌లర్‌ అండ్‌ ఆడి‌టర్‌ జన‌రల్‌’ (కా‌గ్‌)గా ముర్ము బాధ్య‌తలు చేప‌ట్ట‌ను‌న్నట్లు సమా‌చారం. ప్రస్తుతం కాగ్‌గా ఉన్న రాజీవ్‌ మహర్షి ఈ వారం పద‌వీ‌వి‌ర‌మణ చేయ‌ను‌న్నారు.

1985 బ్యాచ్ గుజరాత్ ఐఏఎస్ అధికారి అయిన జీసీ ముర్ము, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, తొలుత ఆర్థిక మంత్రిత్వ శాఖలో విధులను నిర్వర్తించారు. ఆపై వ్యయ విభాగం సంయుక్త కార్యదర్శిగానూ కీలక బాధ్యతలు నిర్వహించారు. గత సంవత్సరం నవంబర్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి వుండగా, అంతకు కొద్ది రోజుల ముందే జమ్మూ కశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించబడ్డారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/telangana/