క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా ప్ర‌మాణం

క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా ప్ర‌మాణం
Manoj Sinha takes oath as new LG of Jammu and Kashmir

కశ్మీర్‌: జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా నియామ‌కం అయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఈరోజు జ‌మ్మూక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌మాణం స్వీకారం చేశారు. జ‌మ్ముక‌శ్మీర్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గీతా మిట్ట‌ల్ నూత‌న ఎల్జీతో రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన సిన్హా మూడుసార్లు లోక్‌స‌భ‌‌కు ఎంపీగా గెలుపొందారు. 2016లో ప్ర‌ధాని మోడి కేబినెట్‌లో కేంద్ర స‌మాచారా ప్ర‌సార శాఖ సహాయ‌ మంత్రిగా ప‌నిచేశారు. కాగా మాజీ గ‌వ‌ర్న‌ర్ గిరీశ్ చంద్ర ముర్మును కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియాగా నియ‌మించడంతో.. క‌శ్మీర్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ ఇవాళ ప్ర‌మాణం చేశారు. క‌శ్మీర్‌కు ఎల్జీగా నియ‌మితులైన మొద‌టి రాజ‌కీయ నేత‌గా మ‌నోజ్‌ నిలిచారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/