వారాహి గురించే మాట్లాడే అర్హత వైస్సార్సీపీ వారికీ లేదు – మనోహర్

nadendla-manohar

వారాహి గురించే మాట్లాడే అర్హత వైస్సార్సీపీ వారికీ లేదంటూ జనసేన పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తాజాగా జనసేన ఎన్నికల ప్రచార రథం సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ వాహనానికి ‘వారాహి’ అనే పేరు పెట్టారు. అయితే ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ వాహన కలర్ ఫై వైస్సార్సీపీ పలు విమర్శలు చేస్తూ వస్తుంది. వారాహికి తెలుపు, నలుపు, మరో రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఆలివ్ గ్రీన్ రంగు కేవలం మిలిటరీ వాహనాలకు మాత్రమే వాడతారని… వారాహికి ఆ రంగు వేయడం చట్ట విరుద్ధమని అన్నారు. డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాన్లను కొనుక్కుని యుద్ధం చేస్తామంటే కుదరదని అన్నారు. ఇలాంటివి సినిమాల్లో నడుస్తాయని, నిజ జీవితంలో కుదరవని నాని అన్నారు. అంతే కాదు సోషల్ మీడియా లోను వైస్సార్సీపీ శ్రేణులు వారాహి ఫై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాదెండ్ల మనోహర్ వైస్సార్సీపీ శ్రేణులపై మండిపడ్డారు.

జనసేన పార్టీ చట్టానికి ఉల్లంఘనగా ఏ పనీ చేయదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు మార్చి కోర్టులో మొట్టికాయలు తిన్నారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో వారాహి ప్రచార వాహనంగా ఉపయోగపడుతుందని తెలిపారు. విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలను సందర్శించడానికి వెళితే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బిసి గర్జనకు ఎన్ని ఆర్టీసీ బస్సులు వేశారని ప్రశ్నించారు. ఏపీఎస్ ఆర్టీసీ కాదు వైఎస్ఆర్టీసీ గా మార్చేశారని వ్యాఖ్యలు చేశారు. సర్పంచులు పోరడుతోంటే చెక్ పవర్‌లు లాగేసుకుంటున్నారన్నారు. వైస్సార్సీపీ నేతల కబ్జాల గురించి సర్వే నెంబర్లతో సహా బాధితులు జనవాణిలో పాల్గొనేందుకు వచ్చారని జనసేన నేత తెలిపారు. జనవరి 12న యువతకు భరోసా ఇస్తూ రణస్ధలంలో యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.