రేపు సిఎంగా ఖట్టర్‌ ప్రమాణ స్వీకారం..!

Manohar Lal Khattar
Manohar Lal Khattar

హ‌ర్యా‌నా : హ‌ర్యానా సీఎంగా మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ఆదివారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. రెండోసారి ఆయ‌న సీఎం బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌మాణ‌స్వీకారోత్స కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపికి 40 సీట్లు ద‌క్కిన విష‌యం తెలిసిందే. అయితే ప‌ది సీట్లు గెలిచిన దుశ్యంత్ చౌతాలాకు చెందిన జేజేపీ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో.. ఖ‌ట్ట‌ర్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది
కాగా ఈరోజు బిజెపి శాసనసభాపక్షం సమావేశమై ఖట్టర్‌ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/