రానున్న దశాబ్దం వారిదే.. మోడి “మన్ కీ బాత్”

ఢిల్లీ: రాబోయే దశాబ్దం అంతా యువతదే అని ప్రధాని నరేంద్ర మోడి వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ విధంగా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో యువత ముఖ్య పాత్ర పోషించబోతున్నారని అన్నారు. వ్యవస్థపై యువతకు అపారమైన నమ్మకం ఉందని, అలాగే సమస్యలపై కూడా అవగాహన కలిగి ఉండడం మంచి పరిణామమని పేర్కొన్నారు. అంతేకాకుండా యువత వివిధ అంశాలపై గందరగోళానికి గురి కావడం లేదని ఆయన చెప్పారు. వచ్చే దశాబ్దంలో దేశంలోని యువత అభివృద్ధి మాత్రమే కాకుండా దేశం కూడా పురోగమిస్తోందని మోడి పేర్కొన్నారు. యువతలో ఉన్న శక్తి, సామర్థ్యాలను బట్టి దేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. ఇటీవలే తాను బీహార్లోని ఓ హెల్త్ సెంటర్ను పరిశీలించానని అన్నారు. చంపారన్ జిల్లా భైరవ్గంజ్లో వేలాదిమంది ప్రజలు ఉచితంగా వైద్యం చేసుకుంటున్నారని తెలిపారు. అయితే ఇది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కాదని ఆయన గుర్తు చేశారు. అక్కడి కెఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమం అని ప్రధాని కొనియాడారు. దానికి వారు సంకల్ప్ 95 అని పేరు కూడా పెట్టారని అన్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/