నిలకడగా మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం

చికిత్సకు ఆయన సహకరిస్తున్నారు..ఎయిమ్స్‌ వైద్యులు

Dr.Manmohan Singh
Dr.Manmohan Singh

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చాతీ నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని , చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిక్స్‌ వైద్యులు తెలిపారు. కాగా మన్మోహన్ కు గుండె నొప్పి రావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని, ప్రస్తుతం ఆయన్ని అబ్జర్వేషన్ లో ఉంచామని అన్నారు. మన్మోహన్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు, పలువురు ప్రముఖలు కోరుకుంటున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/