మన్మథుడు-2 టీజర్‌ విడుదల

manmadhudu-2 teaser
manmadhudu-2 teaser


హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న మన్మథుడు 2 టీజర్‌ విడుదలైంది. మన్మథుడు చిత్రంలో లాగానే ఈ సినిమాలో కూడా పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తూ కాలం గడుపుతుంటాడు. అందుకే నాగ్‌ నుద్దేశించి తల్లి (దేవదర్శిని), బామ్మ(లక్ష్మి) కామెంట్లు చేస్తూ ఉంటారు. టీజర్‌ చివర్లో నాగ్‌ ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌..ఐ ఓన్లీ మేక్‌ లవ్‌ అని చెబుతున్న డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సమంత అతిథి పాత్రలో నటించనున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 9న ముందుకు రానుంది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/