రోగ నిరోధక శక్తిని పెంచే మామిడి

ఆరోగ్యమే మహా భాగ్యం

Mango, which boosts immunity
Mango, which boosts immunity

మండు వేసవి రాకముందే మామిడి కాయలు పలుకరిస్తాయి. మామిడికాయల్లో ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి.

మామిడిలో ఇంకా పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. క్యాన్సర్‌ ప్రమాదాన్ని నివారిస్తుంది.

కొలెస్ట్రాయిల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. మామిడిలో అధిక మొత్తంలో ఉండే పెక్టిన్‌, పీచు పదార్థం రక్తంలో కొలెస్ట్రాల స్థాయిలను తగ్గిస్తుంది.

పెక్టిన్‌ ప్రొస్టేట క్యాన్సర్‌ బారిన పడకుండా ఉంచుతుంది. బరువు పెరగడానికి సహాయపడుతుంఇ. రక్తహీనతను తగ్గిస్తుంది.

మామిడిలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. గర్భధారణ సమయంలో గర్భిణీలకు అవసరమైన ఇనుము వీటి ద్వారా పుష్కలంగా లభిస్తుంది. మొటిమల నివారణకు మామిడి చక్కని ఔషధం.

చర్మానికి అడ్డు పడే రంధ్రాలు తెరుచుకోవటం వల్ల మొటిమలు ఏర్పడడాన్ని నివారిస్తుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.

మామిడికాయలో ఉండే ఎ, సి విటమిన్లు శరీరంలో అధిక మొత్తం కొల్లాజెన్‌ ప్రొటీన్‌ ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తాయి. మామిడికాయలో అధికంగా ఉండే విటమిన్‌ బి 6 మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది. మామిడిలో అధిక పరిమాణంలో ఉండే బీటా కెరొటిన్‌ అనే కెరొటినాయిడ్‌ వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

కంటి ఆరోగ్యానికి మామిడి చక్కని ఔషధం. మామిడి కాయ ముక్కలు ప్రతిరోజూ తీసుకుంటే విటమిన్‌ లభిస్తుంది. తద్వారా రేచీకటి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు దూరమై,కంటి చూపు మెరుగుపడుతుంది.

పచ్చి మామిడికాయ రసంలో నీళ్లు కొంచెం పంచదార కలిపి తాగితే శరీరం చల్లగా మారి వేసవిలో వడదెబ్బ ప్రమాదాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది.

సూర్యుని వేడి వల్ల మన శరీర వేడి తగ్గకపోతే, మూత్రవిసర్జన ఆగి, మూత్రపిండాలు విషపదార్థాలతో నిండే ప్రమాదం ఉంటుంది.

దీనిని నివారించడానికి మామిడికాయ ఎంతో ఉపయోగపడుతుంది.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/