ఆరోపణలపై స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే

alla ramakrishna reddy
alla ramakrishna reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనబడుట లేదని కొందరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వార్తలపై ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి స్పందించారు. సొంత పనులపై నాలుగు రోజులు హైదరాబాద్‌కు వెళ్లానని అన్నారు. దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తారా? అని ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 40 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కనిపించడం లేదని కుప్పం ప్రజలు చెబుతున్నారని ముందుగా దీనికి టిడిపి నేతలు సమధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెల 17న శాసనసభలో రాజధాని అంశంపై ముఖ్యమంత్రి ప్రకటన చేశారని..ఆ తర్వాత కొన్ని రోజులు తాను ఇక్కడే ఉన్నానని ఆర్కే అన్నారు. ఇంకా తాను ఎక్కడకూ వెళ్లలేదని, చాలా రోజుల తర్వాత తమ కుటుంబంలో ఒక వివాహం జరగబోతుందని.. తన అన్న కుమారుడి పెళ్లి పనులపై హైదరాబాద్‌కు వెళ్లానన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఆర్కే హామీ ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైఎస్‌ఆర్‌సిపి అని చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/