తాజాగా మేనకా ఎబిసిడి ఫార్ములా వివాదం

maneka gandhi
maneka gandhi


లక్నో: బిజెపి నాయకురాలు మేనకాగాంధీ తాజాగా చేసిన ఎబిసిడి ఫార్ములా ప్రకటన వివాదానికి తెర తీసింది. వరుణ్‌గాంధీ పోటీ చేస్తున్న ఫిలిబిత్‌ నియోజకవర్గంలో మేనకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఫిలిబిత్‌లో గ్రామాలను ఏబిసిడి కేటగిరిలుగా విభజించి అభివృద్ది చేస్తామని తెలిపారు. 80 శాతం ఓట్లు వచ్చిన గ్రామం ఏ కేటగిరి, 60 శాతం ఓట్లు వస్తే బి కేటగిరి, 50 శాతం ఓట్లు వస్తే సి కేటగిరి, 50 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే డి కేటగిరి గ్రామంగా చేర్చుతామని తెలిపారు. మొదటగా ఏ కేటగిరి గ్రామాల్లో, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి కేటగిరి గ్రామాల్లో అభివృద్ది పనులు చేస్తామని మేనకాగాంధీ స్పష్టం చేశారు. డీ కేటగిరిలో ఏ గ్రామం ఉండకూడదని ఆమె ఓటర్లకు సూచించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి తెర లేపాయి.
ఇటీవలే ఆమె పోటీ చేస్తున్న సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముస్లింలను ఉద్ధేశించి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల కమీషన్‌ ఆమెకు సంజాయిషీ నోటీసులు జారీ చేసింది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/