మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన మండలి

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీల నిర్ణిత కాలం సంవత్సరం నుండి రెండు సంవత్సరాలకు మరియు సభ్యుల సంఖ్యను 14 నుండి 18 వరకు.. అలాగే కమిటీలో రైతుల సంఖ్యను 8 నుండి 12 వరకు పెంచారు. నేడు మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర శాసనమండలిలో ప్రకటన చేశారు. సీఎం కెసిఆర్ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాధాన్యత పెరిగిందని మంత్రి చెప్పారు. ఈ బిల్లుల విషయంలో ఏకగ్రీవంగా సమాధానం తెలిపిన సభ్యులకు, సభకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు.

ఈ నేపథ్యంలో మండలిలో జరిగిన చర్చలో సభ్యులు కల్వకుంట్ల కవిత, వెంకట్రామ్ రెడ్డి, గంగాధర్ గౌడ్ లు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో బలహీనమైన వర్గాలు ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా అని వర్గలకు చెందిన మహిళలు ౩౩ శాతం మంది ఎంపికవుతున్నారని కల్వకుంట్ల కవిత చెప్పారు. మార్కెట్ కమిటీల కాలపరిమితిని ఏడాది నుండి రెండేళ్లకు పొడిగించిన కారణంగా ఆ మార్కెట్ మీద పూర్తి అవగాహన వస్తుందని, సభ్యులు గంగాధర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయమని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి. https://www.vaartha.com/andhra-pradesh/