మండల్‌ కమిషన్‌. బిసిల దండాలు

బిసిలకు సాధికారత లభించేనా

Public
Public

ప్రభువెక్కిన పల్లకేనోయ్ ఆదిమోసే బోయిలు ముఖ్యం కాదంటున్న సామాజిక నేపథ్యంలో, బోయిలు కూడా ప్రజాస్వామ్య పల్లకి ఎక్కాలనే మానవీయకోణంతో, సామాజిక న్యాయం, సహజన్యాయం, చట్ట బద్ధన్యాయం, మెజారిటీ ప్రజలకు దక్కాలనే మహా ఆశయంతో, ఆలో చనల నుండి వచ్చిందే మండల్‌ కమిషన్‌.

స్వాతంత్య్ర అనంతరం దశాబ్దాలుగా, అమానవీయంగా, సమాజంలో సగం కంటే పైగా ఉన్న బిసిలకు సహజన్యాయం సామాజిక న్యాయం ఎండమావిగా ఉన్న నేపథ్యంలో వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిందే మండల్‌ కమిషన్‌.

అప్పటి జనతాదళ్‌ నాయకత్వంలోని ప్రధానమంత్రి విపి సింగ్‌ మండల్‌ కమిషన్‌ అమలు చేస్తామని ప్రకటించడంతో రిజ ర్వేషన్‌ అనుకూలురు, వ్యతిరేకులుగా దేశం రెండుగా చీలిపో యింది. అధికారం, అవకాశాలు మెజారిటీలైన ఒబిసిలకు కాకుండా అన్నీ మాకే కావాలని ఉద్యమాలు చేశారు.

ఢిల్లీలో రాజీవ్‌గోస్వామి అనే విద్యార్థి కాల్చుకుని చనిపోయిన సంఘటనలో బిజెపి అగ్ర నాయకులు కూడా రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

తాడిత, పీడిత ప్రజలపక్షం అనే జ్యోతిబసు, సోమ్‌ నాథ్‌ చటర్జీ, ఇంద్రజిత్‌ గుప్తాలాంటి నాయకులు కూడా ద్వంద ప్రమాణాలు పాటించారు. వారితీరు ఎలా ఉందంటే వ్యాపార ప్రకటనలలో కండిషన్స్‌ అప్లైలా ఉంది. రాజీవ్‌గాంధీ కూడా పార్లమెంట్‌లో బిల్లుపెట్టిన రోజు మండల్‌కమిషన్‌కు వ్యతిరేకంగా రెండుగంటలు ప్రసంగించారు.

దేశంలోని మెజారిటీ పార్టీల నాయకుల అధినాయకులందరు రిజర్వేషన్లపై విషం కక్కటంతో పెద్దఎత్తున అల్లర్లు జరిగాయి. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని మరణించారు. మండల్‌ కమిషన్‌కు అనుకూలంగా, జాతీయస్థాయిలో శరద్‌యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌, లాలుప్రసాద్‌యాదవ్‌లు, ఒబిసిలకు నాయకత్వం వహించి అగ్రభాగాన నిలిచారు.

ఈ త్రితయం మండలేట్స్‌గా పేరు గాంచారు. వీరు నేటికీ బలహీనవర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారు. మండల్‌ కమిషన్‌ నాటి నుండి బలహీనవర్గాలలో కొంత మేరకు ఐక్యతా బీజం కూడా పడిందని చెప్పవచ్చు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శంకర్‌గౌడ్‌ నాయకత్వంలో సమ సమసంగ్రామ పరిషత్‌ ఏర్పాటు రిజర్వేషన్‌ అనుకూల ఉద్యమానికి బలమైన నాయకత్వం అందించారు.

ఆగస్టు 7, 1990లో కేంద్రప్రభుత్వరంగ సంస్థలలో అమలు ప్రారంభించడంతో, మండల్‌కమిషన్‌ అమలైంది. దీన్ని ‘మండల్‌ డేగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, దేశవ్యాప్తంగా బలహీనవర్గాల ప్రజలు, మేధావ్ఞలు కోరుకుంటున్నారు.

మండల్‌ కమిషన్‌ ఒబిసిల అభివృద్ధి కోసం విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించడం గురించి సమగ్రంగా, నలభై డిమాండ్లతో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక ఇచ్చింది. కానీ కేవలం విద్యా, ఉపాధి అవకాశాలలో మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అమలు చేయకపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఒబిసిలు అసంతృప్తిగా ఉన్నారు.

చట్టసభలలో వీరికి రిజర్వేషన్లు లేక పోవడం వల్ల పాలక కులాల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడ వలసివస్తుంది. పార్లమెంట్‌లో 275కుపైగా ఉండాల్సిన ఒబిసి యంపిలు పదుల సంఖ్యకే పరిమితం కావాల్సి వస్తుంది.

పాలకులు ఈ వర్గాలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప వాస్తవంగా చూడటం లేదు. కారణం ఒబిసిల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంతోపాటు దశాబ్దాలుగా పదుల సంఖ్యలో ఉన్న పాలక కులాలకే, అధికారం హస్తగతం కావడం, ఈ కులాల చేతిలోనే సంపద కేంద్రీకృతం కావడం, ఎన్నికల కమిషన్‌ చట్టబద్ధంగా పనిచేయకపోవడం, ఓటుకు ఖరీదు పెంచడం కొనుగోలు శక్తి కూడా వీరికే ఉండటం కారణాలు.

నిర్మాణం లేని బిసి ఉద్యమాలు ప్రజల్లో కాకుండా పత్రికల్లోనే ఉద్యమాలు చేసి, ఆ పబ్లిసిటీని మార్కెటింగ్‌ చేసుకుని, సంపన్నులుగా మారి సామాన్యులుగా నటించే కొంతమంది బిసి నాయకులు కూడా కారణమే. స్వాతంత్య్రం అనంతరం బిసిల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వస్థాయిలో 1953లో కాకకలేల్కర్‌ (1952-1955) కమిటిష్‌ మొదటిది.

1955 ఈ కమిషన్‌ నివేదికి ఇచ్చింది. జాతీయ మండల్‌ కమిషన్‌ రెండవది. 52 శాతం ఉన్న బిసిలలో విద్యాపరంగా, కులపరంగా ఉనవివక్షను నిర్మూలిం చడానికి మండల్‌ కమిషన్‌ జనవరి 1, 1978లో ఏర్పాటైంది. 1980లో నివేదిక ఇవ్వడం జరిగింది.

జనతా పార్టీ ఏలుబడిలో ప్రధాన మంత్రి మురార్జీదేశా§్‌ు నాయకత్వంలో మండల్‌కమిషన్‌ ఏర్పాటైంది. దీనికి బిందేశ్వరీప్రసాద్‌ మండల్‌ ఛైర్మన్‌గా వ్యవహ రించారు.

ఈయన బీహార్‌లోని బనారస్‌లో ఆగస్టు 25,1918లో జన్మించారు. ఏప్రిల్‌ 13, 1982లో మరణించారు. బీహార్‌లోని సహర్సాలోని భూస్వామ్య యాదవ కులంలో జన్మించారు. 1930లో పాట్నాలో ఇంటర్‌ చదివారు. మండల్‌ తన 23వ ఏటా జిల్లా కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. నిజాయితీపరుడిగా పేరుంది.

1945 నుండి 1951 వరకు మాదేపురా డివిజన్‌లో జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌గా జీతం తీసుకోకుండా పనిచేశారు. 1952 మొదటిసారి బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

1965లో తన నియోజకవర్గ మైన పామాలో పోలీసులు మైనారిటీలు దళితుల మీద దాడులను నిరసిస్తూ మాట్లాడాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి కట్టడిచేస్తే ఆత్మగౌరవం చంపుకోలేక రాజీనామా చేసి సంయుక్తసోషలిస్టు (ఎస్‌.ఎస్‌.పి)పార్టీలో చేరారు. 1962 వరకు ఏడు సీట్లు ఉన్న ఆ పార్టీకి 1969 ఎన్నికలలో 69 సీట్లు సాధించి పెట్టారు.

1968 ఫిబ్రవరి 1 కాంగ్రెస్‌ మద్దతుతో బీహార్‌ రాష్ట్రానికి రెండవ ముఖ్య మంత్రి అయ్యారు. కాంగ్రెస్‌ నాయకుల అవినీతిపై మండల్‌, అయ్యర్‌ కమిషన్‌ వేయగా, రిపోర్ట్‌ బయట పెట్టవద్దని ఇందిరా గాంధీ కోరారు.

ఆమె మాట వినకపోవడంతో మద్దతు ఉపసంహ రించడంతో నెల రోజులకే రాజీనామా చేయాల్సివచ్చింది. మెజి స్ట్రేట్‌గా జీతం తీసుకోకుండా పనిచేశారు. ఈ కమిషన్‌ సామాజిక, విద్యా, సాంస్కృతిక, ఆర్థిక తదితర 11 అంశాల ప్రాతిపదికగా రిపోర్టు ఉండాలని కమిషన్‌ నిర్దేశించింది.

ఆ తరువాత మురార్జీ దేశా§్‌ు మరణించడం, కాంగ్రెస్‌నాయకత్వంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రికావడంతో 10 ఏళ్లు మండల్‌ కమిషన్‌ మరుగున పడింది.రాజ కుటుంబం నుంచి వచ్చిన విపిసింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని అమలు చేయడంతో విశ్వనాథప్రతాప్‌ సింగ్‌, ఒబిసిల ఆరాధ్యనాయకుడయ్యారు.

మండల్‌ స్ఫూర్తితో 55 శాతం ఉన్న ఒబిసిలు వారెంతో వారికంత వాటా దక్కాలన్నా అవ సరాన్ని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రేమతో కాక పోయినా, పరిణామక్రమంగా వారిలో వస్తున్న చైతన్యం మార్పులు పరిగణనలోకి తీసుకోవాలి. పాలకులు ఒబిసిలపట్లఆపదమొక్కులు, అవసరార్థం అనేతీరుతో వ్యవహరించడం వల్ల అసంతృప్తితో ఒబిసిలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశంలో 55శాతం పైగా ఒబిసిలు ఉన్నది సత్యం.

వారికి సకల రంగాలలో దామాషా దక్కాల్సింది ధర్మంకాదా. ఒబిసిలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ లేకపోవడం అన్యాయం కాదా. రెవెన్యూ రికార్డులప్రకారం చెట్లకు, పుట్టలకు గుట్టులకు లక్కలున్నాయి.

నరేంద్రమోడీ ఒబిసి ప్రధాన చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు.ప్రభుత్వ విధానాలద్వారా, రాజకీయ,సంక్షేమ,అభివృద్ధి కార్య క్రమాలు చిత్తశుద్ధితో అమలు చేస్తేనే మండల్‌ కమిషన్‌ఉద్యమంలో బిజెపి ఒబిసిలకు వ్యతిరేకమనే ముద్రపోతుంది.

మండల్‌ కమిషన్‌ అమలై 30 ఏళ్లు అవ్ఞతున్నా, బిపి మండల్‌, విపి సింగ్‌ ఒబిసిల స్మృతిపథంలో మెదలాడుతూనే ఉన్నారు.

  • సాధంవెంకట్‌, సీనియర్‌ జర్నలిస్టు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/