తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడింది

mandakrishna madiga
mandakrishna madiga

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడిందని, అదేవిధంగా ఆర్టీసీని కూడా ప్రమాదం పడేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని ఆయన వాపోయారు. ఆర్టీసీ జోలికి వస్తే కేసీఆర్‌ను ప్రజలు సహిచరన్నారు. రాష్ట్రంలో కోర్టులు, రాజ్యాంగం లేవన్నట్లుగా, ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచామన్న అహంకారం పనికిరాదన్నారు. జనరల్‌ ఎన్నికలలో గెలిచి చూపించాలని ఆయన సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ గెలవడం కోసం వందల కోట్లు ఖర్చు చేసిందని మందకృష్ణ ఆరోపించారు. పోరాటాలు చేసైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news