షూటింగ్ లో గాయపడ్డ మంచు విష్ణు

మంచు విష్ణు షూటింగ్ లో గాయపడినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు..ప్రస్తుతం జిన్నా అనే సినిమా చేస్తున్నాడు. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే, కోనా వెంకట్ అందించడం విశేషం. ఈ మూవీ తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషలో రూపొందుతోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

తాజాగా హీరో మంచు విష్ణు..జిన్నా మూవీ షూటింగ్ సెట్ లో గాయపడినట్లుగా తెలుస్తోంది. డ్యాన్స్ చేస్తుండగా కాలికి గాయమైంది అంటూ తన ఇన్స్టా స్టోరీలో పిక్ షేర్ చేశారు. విష్ణు ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి మూలకథ అందించిన ఈ చిత్రానికి సంగీతం : అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ : ఛోటా కె నాయుడు.