ఒక్క ట్వీట్ చేసి ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసిన మంచు మనోజ్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన మంచు మనోజ్..తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమైన మనోజ్.. ఆ తర్వాత బిందాస్ చిత్రంతో నంది అవార్డ్ అందుకున్నారు. తర్వాత వేదం, ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ, రాజు భాయ్ వంటి చిత్రాలతో మెప్పించారు. ఆ తర్వాత పలు ప్లాప్స్ పడేసరికి సినిమాలకు దూరమయ్యాడు. అలాగే సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉండడం లేదు. ఈ మధ్య రెండో పెళ్లి తో మళ్లీ వార్తల్లో నిలిచాడు.

ఇక ఇప్పుడు సడెన్ గా ఓ ట్వీట్ చేసి మీడియా లో మాట్లాడుకునేలా చేసాడు. “ఈ విషయం చాలా రోజులుగా నా మనసులోనే దాచుకున్నాను.. నా జీవితంలోని మరో దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను.. అదేంటో 20 జనవరి 2023న ప్రకటిస్తాను.. నాకు ఎప్పటిలాగే మీ అందరి ఆశీస్సులు కావాలి”.. అంటూ ట్వీట్ చేశారు మనోజ్. దీంతో మనోజ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి చెప్పుతున్నారా ?.. లేదా సెకండ్ మ్యారెజ్ అనౌన్స్ చేయబోతున్నారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అసలు విషయం ఏంటీ అనేది తెలియాలి అంటే జనవరి 20 వరకు ఆగాల్సిందే.

2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న మనోజ్.. ఆ తర్వాత 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా మనోజ్ రెండో పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనికతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సున్నితంగా స్పందించారు. మరి ఇప్పుడు జనవరి 20 న ఏం చెపుతాడో అని అంత వెయిటింగ్.