లక్ష్మి మంచు కూతురు అరుదైన ఘనత.

నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు

Manchu Lakshmi Daughter Vidya Nirvana with her Family

లక్ష్మీ మంచు ఆరేళ్ల కూతురు విద్యా నిర్వాణ మంచు ఆనంద్‌ అరుదైన ఘనత సాధించింది. విద్యా యంగ్‌ చెస్‌ట్రైనర్‌ కావటం ద్వారా తన కుటుంబం గర్వించేలా చేసింది. .నోబెల్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో విద్యాచోటు దక్కించుకుంది.. విద్యా మోక్షన్‌ నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధి డాక్టర్‌ చోకలింగం బాలాజీ సమక్షంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.. విద్యా నిర్వాణ ఈ ఘనతను సాధించినందుకు మోహన్‌బాబు, లక్ష్మీ ప్రసన్న మంచు సహా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు..

ఈసందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలను వారి లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు.. మంచు వారసురాలు సాధించిన ఘనతకు అభిమానులు సోషల్‌మీడియాలో సంతోషం వ్యక్తంచేస్తున్నారు.