కరోనా బారినపడ్డ మంచు లక్ష్మి

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ లో కరోనా కల్లోలం సృష్టించింది. మంచు మోహన్ బాబు గారాల పట్టి మంచు లక్ష్మి కరోనా బారినపడింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ చివరికి దానికి బారిన పడకతప్పలేదు. దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్‌ ఉంటుంది కదా. అందుకే నన్ను విడిచిపెట్టలేదు. కరోనాకు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్‌తో నానుంచి దాన్ని ఎలాగైనా పంపించేస్తా.

అందరూ ఇంట్లో సేఫ్‌గా ఉండండి. మాస్కులు కచ్చితంగా ధరించండి. వాక్సిన్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సా​ర్లు టీకా తీసుకొనిఉంటే.. బూస్టర్‌ కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి’ అని మంచు లక్ష్మీ వరుస ట్వీట్స్‌ పోస్ట్ చేసింది. మంచు లక్ష్మి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతి నడుస్తుంది. ఈ క్రమంలో మరోసారి భారీఎత్తున ప్రజలు కరోనా బారినపడుతున్నారు. ఇక చిత్రసీమలోను కరోనా అలజడి నడుస్తుంది. ఇప్పటికే కమల్ హాసన్, మంచు మనోజ్, విశ్వక్ సేన్ లాంటి టాలీవుడ్ హీరోలకు కరోనా మహమ్మారి సోకింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో మంచు లక్ష్మి చేరింది.