ప్రతిక్షణం ఒక వరం.. ప్రతిరోజూ విలువైంది..

మనస్విని: వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం

Personal issues
Personal issues

మేడమ్‌, నా వయస్సు 32 సంవత్సరాలు. మా చెల్లి సడెన్‌గా పిచ్చిగా ప్రవర్తిస్తోంది. చచ్చిపోతాను అంటోంది. అడగ్గా తెలిసింది. ఏమంటే, ఆమె ఒకరిని ప్రేమించింది. అతను సడెన్‌గా ఆమెతో మాట్లాడటం మానేసాడట. పెళ్లిచేసుకోనుఅంటున్నాడట. మాకు ఏంచెయ్యాలో తోచటంలేదు. ఏంచేస్తే మా చెల్లి బాగవుతుంది? కొంచెం వివరించండి ప్లీజ్‌. – సంధ్య, హైదరాబాద్‌,

మీ చెల్లి మరల బాగయిపోయి, మంచిగా ఉంటుంది. కానీ మీరు ఆమెకి అర్థం చేసుకొని, మార్గదర్శకులుగా ఉండాలి. సమస్యగల కారణం తెలుసుకొని, ఆ కారణాన్ని నివృత్తి చెయ్యాలి. ఈ విషయంలో వృత్తి నిపుణుల సలహాలు తీసు కొంటే మంచిది. అంటే కౌన్సిలింగ్‌ ఇప్పిస్తే మంచిది. తిరిగి వెంటనే ఆమూలుగా అయిపోతుంది. అప్పటి వరకు మీరు ఆమెని జాగ్రత్తగా చూచుకోవాలి. ఆమె సమస్యను వినాలి. అర్థం చేసు కోవాలి. ఆమెతో స్నేహంగా, ప్రేమగా మెల గాలి. అప్పుడు ఆమె మీతో అన్నీ పంచుకొంటుంది. అప్పుడు సమస్యకు పరిష్కారం ఆమెతో కూడా చెప్పించవచ్చు.

ఎందుకంటే, ఆమె సమస్య ఆమెకు ఎక్కువ తెలుసుకాబట్టి ఆమెకు ఆమే పరిష్కారించుకొనే దిశలో మీరు ప్రయత్నం చేయవచ్చు. ఏదిఏమైనా ఆమెకు స్వాంతన, ప్రశౄంతత కలిగించాల. ఆమె ఆనందంగా ఉండేటట్లు చూడాలి. గృహవాతావరణం ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. ఆమె బాధను అర్థం చేసుకొని, పరిష్కారం చూపించాలి. ఆమె కూడా స్పష్టతతో చూడకలిగేలా మీరు మీ
వంతు సహాయం చెయ్యాలి. అన్నింటికీ మించి ఆమెపై సానుభూతి అనుబంధం, ప్రేమ ఉండాలి. అప్పుడు సమస్య తేలిగ్గా పరిష్కారమవుతుంది. అందరూ ఆనందంగా ఉండగలరు.

మేడమ్‌ నా వయస్సు 50 సంవత్సరాలు మా ఇంట్లో మేము ఆరగురు ఉంటాము. మ కుటుంబ సభ్యుంలో ఏ ఒక్కరికి అనారోగ్యం వచ్చినా, కష్టం వచ్చినా, నేను విపరీతంగా భయపడిపోతాను. బాదపడిపోతాను. ఈ ఫోబియా నుండి, ఈ భయం నుండి ఈ బాధ నుండి బయట పడటం ఎలా? కొంచెం వివరించండి ప్లీజ్‌ మేడమ్‌. – శారద, వరంగల్‌.

మీరు తప్పక ఈ ఫోబియా అంటే, విపరీతమైన భయం నుండి బయటపడగలరు. ముందుగా ఈ భయాలు పోగొట్టుకోడానికి మీరు శాయిశక్తులా ప్రయత్నం చెయ్యాలి. అంటే మీ వంతుకృషి మీరు చెయ్యాలి. అంటే ‘సబేతనంగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యలు అనారోగ్యం, బాధలు రాకుండా ఉండాలి. అంటే మనం చాలా జాగ్రతలు తీసుకోవాలి. ఏ పనిచేసినా, వాటి పరిణామాలు గురించి అవగాహన చేసుకోవాలి. ఆలోచించి పనులు చెయ్యాలి. ఆందోళనతో, భయంతో, అవగాహనా రాహిత్యంతోకాదు. అవగాహనతో స్పష్టతతో, మంచి ఆలోచనలతో, పనిచేస్తే, ఆ పని సఫలీకృత మవుతుంది.

అదే గుడ్డిగా, అస్పష్టతతో, భయంతో, అనుమానంతో, పనిచేస్తే, పరిణామాలు చెడ్డగా వస్తాయి. అంటే మనం వత్తిడితో భయాలతో ఆందోళనతో ఉంటే, మన మానసిక, శారీరక ఆరోగ్యం చెడిపోతాయి.మంచి అలవాట్లతో మంచి ఆరోగ్యం వస్తుంది. చెడు అలవాట్లతో ఆరోగ్యం చెడిపోతుంది. ఈ జీవితం అమూల్యమైనది. ప్రతిక్షణం ఒక వరం ప్రతిరోజూ విలువైంది. అందువల్ల మనం ఆనందంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సచేతనంగా ఆలోచించి, అవగాహనతో, స్పష్టతతో పనిచేయాలి. అప్పుడు అన్నీ బావుంటాయి.

-డాక్టర్‌ ఎం.శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/