వ్యతిరేక ఆలోచనలకు స్వస్తి

మనస్విని: వ్యక్తిగత సమస్యలకు పరిష్కార వేదిక

Personal problems
Personal problems

మేడం, నా వయస్సు 55 సంవత్స రాలు . నా భర్త తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఎప్పుడు ఏదో ఒక ఒత్తిడి నాకు. ఆయన నేను ఏమి చెప్పినా వినటం లేదు. భోజనం సరిగ్గా చేయటం లేదు. విసుగ్గా ఉంటున్నారు. నడవలేక పోతున్నారు. దిగులు ఎక్కువ అయిపోయింది ఆయనకు . నేను ఏం చేస్తే ఆయన ఆరోగ్యము బాగవుతుంది. కొంచెం వివరించండి ప్లీజ్.
శ్రీ విద్య , హైదరాబాద్.

మీ భర్త ఆరోగ్యం భాగవుతుంది. దిగులు వద్దు. ధైర్యంగా ఉండండి. మంచి వైద్యం ఇప్పించండి. ఇపుడు మంచి విద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. క్రమం తప్పకుండా వైద్యం తీసుకోవాలి. అన్నింటినీమించి మానసికంగా ప్రశాంతంగా , ఆనందంగా ఉండటానికి మీరు మీ శాయి శక్తులా ప్రయత్నం చేయండి. మీరు కూడా సానుకూలంగా ఆలోచించాలి. దిగులు , ఒత్తిడి, ఆందోళన దగ్గరకు రానీయకండి. బంధువులు , స్నేహితుల సహాయం తీసుకొండి . ఆయన ఆరోగ్యముగా ఉండేటట్లు చూడండి. కొద్దిరోజులు ఆయనకు సహాయకుల సాయం ఇప్పించండి. ప్రకృతిని సందర్శించేలా చేయండి. మంచి కాలక్షేపం చాలా అవసరం . ఆనందంగా ఉండటం చాలా ముఖ్యం.

వర్తమానంలో జీవించాలి. ఈరోజున యెంత ఆనందంగా ఉండగలరా అంట ఆనందంగా ఉండండి. ఆయనను కూడా ఉంచండి. ప్రేమానుబందాలతో ఆరోగ్యము చక్కగా కుదుట పడుతుంది. భయాందోళనతో ఆరోగ్యము క్షీణీస్తుంది . అందువలన మానసిక ఆనందం ప్రశాంతత ఎంతో ముఖ్యం. గృహ వాతావరణాన్ని ఆనందంగా తీర్చి దిద్దు కోవాలి. వ్యతిరేక ఆలోచనలకు స్వస్తి పలకండి. క్రమంగా ఆరోగ్యము మెరుగు అవుతుంది. ఇందులో సందేహం లేదు. ఎవరి ఆరోగ్యము వారి చేతుల్లోనే ఉంది. అందువల్ల మీరు మీ భర్తను సానుకూల ఆలోచనల వల్ల కలిగే లాభాలను , ఆయనకు అర్ధం అయ్యేలా విశదీకరించండి. లేకపోతే కౌన్సిలింగ్ ఇప్పించండి. వృత్తి నిపుణుల సలహాలు చాలా మేలు చేస్తాయి .

డాక్టర్ ఎం శారద, సైకాలజీ ప్రొఫెసర్

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/