ట్రంప్‌ మాస్క్‌తో వచ్చి దొంగతనం

Man wearing Donald Trump mask
Man wearing Donald Trump mask

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ఓ దొంగ కాస్త వినూత్నంగా దొంగతనం చేశాడు. సీసీ కెమెరాల్లో అతని ముఖం కానపడకుండా ఉండేందుకు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాస్క్‌నే ధరించి దొంగతనానికి పాల్పడ్డాడు. ట్రంప్‌ వేషధారణలో ఓ షాపులో దర్జాగా ప్రవేశించి తన పని తాను ఎంచక్కా పూర్తి చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఆస్ట్రేలియాలోని స్టార్త్‌పైన్‌ నగరంలో ఒక దొంగ ట్రంప్‌ మాస్క్‌ను పెట్టుకొని ఓ జ్యుయెలరీ షాపులో చోరికీ పాల్పడ్డాడు. ఆదివారం వేకువజామున ఆ షాపు గాజు అద్దాలను పగలగొట్టి.. షాపులో ఉన్న వాచీలను ఎత్తుకొని వెళ్లిపోయాడు. అంతటితో ఆగకుండా అదే వేషధారణలో ఓ ఎలక్ర్టానిక్‌ దుకాణంలో కూడా దొంగతనం చేసి పలు వస్తువులను దొంగతనం చేశాడు. ఆ దొంగ ఆరోజు ట్రంప్‌ మాస్క్‌తో పాటు బ్లాక్‌ నైక్‌ జంపర్‌, బ్లాక్ ట్రాక్‌ ప్యాంట్‌, వైట్‌ షూ ధరించి ఉన్నాడు. అయితే ఆ దొంగ ఎవరో కనిపెట్టడం ఇప్పుడు పోలీసులకు కష్టంగా మారింది. అతడిని ఎవరైనా గుర్తు పడితే తమకు సమాచారమివ్వాలని ఆస్ట్రేలియా పోలీసులు కోరుతున్నారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/