పోలీసు వాహనం ఢీకొని వ్యక్తి మృతి

road accident
road accident


హైదరాబాద్‌: కాగా కర్మన్‌ఘాట్‌లోని శుభోద§్‌ు కాలనీకి చెందిన చందర్‌రావు (32) ఘట్‌కేసర్‌లో ఓ నర్సరీలో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ఉప్పల్‌లోని మేట్రోస్టేషన్‌ దగ్గర రోడ్డు దాటుతుండగా..కుషాయిగూడకు చెందన డిటెక్టివ్‌ ఆఫీసర్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రామచందర్‌రావును స్థానికులు దగ్గరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం అతను మృతిచెందాడు. దీనికి కారణమైన డ్రైవరుపై కేసు నమోదు చేయడంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకొని హెడ్‌క్వార్టర్స్‌కు తరలించినట్టు ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/