ఏపీలో గుంతల రోడ్ల కారణంగా వ్యక్తి మృతి..మరొకరు బలి కావొద్దంటూ గుంతను పూడ్చేసిన కుటుంబ సభ్యులు

ఏపీలో మొదటి నుండి కూడా వైస్సార్సీపీ ప్రభుత్వం ఎదురుకుంటున్న విమర్శ రోడ్ల ఫై. గుంతల రోడ్లను బాగుచేయండని మొదటి నుండి ప్రజలు , విపక్షాలు కోరుకుంటున్నాయి. ప్రభుత్వం మరమత్తులు చేస్తుంది కానీ పూర్తి స్థాయిలో మాత్రం చేయలేకపోతోంది. దీంతో తరచూ రోడ్ ప్రమాదాలు జరగడం..మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరుగుతుంది. తాజాగా విశాఖపట్నంలో ఈ నెల 4న రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి రోడ్ ఫై గుంత కారణముగా ప్రాణాలు విడిచాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు మాత్రం మరొకరి ప్రాణాలు పోకూడదని తమ సొంత ఖర్చుతో సిమెంట్, ఇసుక, కంకర తీసుకెళ్లి దాన్ని విజయవంతంగా పూడ్చేశారు. తద్వారా మరో ప్రమాదం జరగకుండా అడ్డుకట్ట వేయగలిగారు. దీంతో ఈ ఘటన వైజాగ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

వివరాల్లోకి వెళ్తే..

ఈ నెల 04 న రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి డీఆర్ఎం కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ కు బైక్ పై వెళ్తున్నాడు. మధ్యలో రోడ్డుపై గుంతను చూసుకోలేదు. అంతే ఆ రోడ్డు గుంత ఆయన్ను మింగేసింది. కింద పడగానే ఆయన పోయాయి. దీంతో ఆయన కుటుంబానికి కుటుంబ పెద్ద దూరమయ్యారు. రోడ్డుపై గుంతలో పడి తమ కుటుంబ సభ్యుడు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. తమకు జరిగిన అన్యాయం మరో కుటుంబం లో జరగకూడదని, ఆ గుంత వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు వెంటనే దాన్ని పూడ్చే పని చేపట్టారు. తమ సొంత ఖర్చుతో సిమెంట్, ఇసుక, కంకర తీసుకెళ్లి దాన్ని విజయవంతంగా పూడ్చేశారు. తద్వారా మరో ప్రమాదం జరగకుండా అడ్డుకట్ట వేయగలిగారు. దీంతో ఈ ఘటన వైజాగ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అధికారులు చేయాల్సిన పనిని బాధితులు చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలోని రోడ్లపై గుంతల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం నిద్రపోతుందని విమర్శించారు. ప్రమాదాల తర్వాతైనా మేలుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈనెల 4న విశాఖ వాసి సుబ్బారావు గుంత కారణంగా మరణించగా అతడి కుటుంబ సభ్యులే సొంత ఖర్చులతో ఆ గుంతను పూడ్చడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు.

సుబ్బారావుకు జరిగిన రోడ్డు ప్రమాద స్థలం వద్ద ఈనెల 6న మరో వ్యక్తి అదే గుంతలో పడి గాయపడ్డాడని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నాయకులకు అధికారమిచ్చి, పన్నుల రూపంలో డబ్బులు కట్టి చివరకు చేయాల్సిన పని కూడా ప్రజలే చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.