ఫ్లైఓవర్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

man jumps lb nagar flyover commits suicide
man jumps lb nagar flyover commits suicide

హైదరాబాద్‌: నగరంలో ఎల్‌బినగర్‌ ఫ్లైఓవర్‌పై నుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత అర్ధరాత్రి ఫ్లైఓవర్‌ పైకి ఎక్కి రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం, లోయపల్లికి చెందిన నరేందర్‌ గౌడ్‌ కిందకు దూకేశాడని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు వివరించారు. నరేందర్ గౌడ్ ఆత్మహత్యకు కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలే కారణమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతడికి జీవితంపై విరక్తి వచ్చిందని, ఈ ఘటనకు పాల్పడ్డాడని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/