పవిత్ర సరయూనదిలో ముద్దుల్లో మునిగిన జంట..చితకబాదిన జనం

అయోధ్యలో ప్రవహించే పవిత్ర సరయూనదిలో ఓ జంట ముద్దుల్లో మునిగిపోవడం తో అది చూసిన జనాలు సదరు వ్యక్తిని చితకబాదిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పవిత్ర సరయూ నదిలో ఓ జంట స్నానానికి దిగారు. ఈ క్రమంలో భార్యకు భర్త ముద్దు పెట్టాడు. పక్కనే స్నానం చేస్తున్నవారు అది చూసి ఆగ్రహం తెచ్చుకున్నారు. అయోధ్యలో ఇలాంటి వాటిని సహించబోమంటూ మూకుమ్మడిగా అతడి ఫై దాడిచేశారు. నది నుంచి బయటకు లాక్కుంటూ దాడి చేశారు. భార్య అడ్డం పడుతున్నా ఆగలేదు సరికదా, తిడుతూ అతడిని కొడుతూనే ఉన్నారు. ఓ వ్యక్తి మాత్రం వారిని అడ్డుకుని ఆ జంటను బయటకు పంపాడు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO— Suneet Singh (@Suneet30singh) June 22, 2022