కృష్ణాజిల్లాలో ఘోరం : తెలిసినవాడే కదా అని బైక్ ఎక్కితే..పాడు పని చేయబోయాడు

ఈరోజుల్లో కొంతమంది మగవారు వావి వరుసలు, వయసును మరచిపోతున్నారు. మహిళ కనిపిస్తే చాలు వారిని కామంతో చూస్తూ రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలను , పండుముసలి వారిని , అభం శుభం తెలియని చిన్నారులను సైతం వదిలిపెట్టడం లేదు. ప్రతి రోజు పదుల సంఖ్యలో కామాంధుల చేతుల్లో అమాయకపు మహిళల జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. తెలిసినవారే కదా అని అతడి బైక్ ఎక్కితే.. ఆ యువకుడు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పాడుపనిచేయబోయాడు.

వివరాల్లోకి వెళ్తే

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం అమీనాపురం గ్రామానికి చెందిన ఓ మతగురువు మనవడకి.. గన్ననరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పరిచయముంది. సదరు యువతీ హనుమాన్ జంక్షన్ లో చదువుకుంటూ బంధువుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో యువతికి ఫోన్ చేసిన యువకుడు తాను గన్నవరం బస్టాండ్ వద్ద ఉన్నానని.. కలుద్దాం రమ్మని పిలిచాడు. తెలిసినవారు కదా అని ఆమె గన్నవరం వెళ్లింది. అక్కడి నుంచి యువతిని బైక్ పై ఎక్కించుకొని చినవుటపల్లి శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను కొట్టి అత్యాచారానికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న యువతీ.. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టకి తీసుకెళ్లింది. దీంతో వారు ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు.