మమతా బెనర్జీ ఎడమ కాలికి గాయం

48 గంటలపాటు పర్యవేక్షణ అవసరమైన వైద్యులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కొంతమంది దాడి చేయగా ఆమె కింద పడిపోయారు. ఈ నేపధ్యంలో ఆమెకు ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో ఎక్స్‌రే తీశారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం మమతా బెనర్జీ ఎడమ కాలికి గాయం కావడంతోపాటు, వాపు వచ్చింది. దీంతో ఆమె కాలికి కట్టు కట్టారు. ప్రస్తుతం మమతా బెనర్జీ ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు.

అలాగే ఊపిరి తీసుకోవడంలోనూ ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు ఆమె ఎడమ కాలి చీలమండ దగ్గర తీవ్రగాయమైంది. పాదాలపైన స్వల్పగాయాలయ్యాయి. అదేవిధంగా ఆమె కుడి భుజం మీద కూడా గాయమైంది. కాగా, ఆమె మణికట్టు, మెడ మీద కూడా గాయాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. సీఎం మమతా బెనర్జీ మరో 48 గంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, చికిత్స పొందుతారన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/