గంగూలీపై మమత ఫైర్‌

చెప్పకుండా మ్యాచ్ రద్దు పై ఆగ్రహం

Mamata Fire on Ganguly

nullకోల్‌కత్తా:బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌గంగూలీపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్‌ అయ్యారు. ఈనెల 18వ తేదీ కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మూడో వన్‌డే జరగాల్సి ఉండగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఉందని ఆ మ్యాచ్‌తోపాటు మొత్తంగా మూడు వన్‌డేల సిరీస్‌నే బిసిసిఐ రద్దుచేసింది.

కానీ కోల్‌కత్తాలోమ్యాచ్‌ రద్దుచేసేముందు తమకి ఒక మాట చెప్పి ఉంటే గౌరవంగా ఉండేదని మమతా పేర్కొన్నారు. గంగూలీతో అంతా బాగానే ఉంది. కానీ మ్యాచ్‌రద్దుకి ముందు ఒకమాట అయినా ప్రభుత్వం తోచెప్పి ఉండాల్సింది. కనీసం కోల్‌కత్తాపోలీసులకైనా సమాచారం ఇచ్చి ఉంటే గౌరవంగా ఉండేది. అంతే తప్ప మ్యాచ్‌ రద్దయిన తర్వాత చెపితే ఉపయోగమేంటి.

అయినా మేం మ్యాచ్‌ని నిలిపివేయమని ఏమీ అడగలేదే, ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, పోలీస్‌కమిషనర్‌ ప్రభుత్వ పెద్దలకు ఒక్కమాట అయినా చెప్పడం కనీస గౌరవం కాదా అని ఆమె ప్రశ్నించారు. వారం రోజులుగా తమ రాష్ట్రంలో ఐపిఎల్‌ నిర్వహించవద్దంటూ కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి.

పశ్చిమబెంగాల్‌ణుంచి అలాంటి నిబంధనలు ఏమీ వినిపించలేదు. పైగా బెంగాల్‌క్రికెట్‌ అసోసియేషన్‌ క్యాబ్‌ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడు కాగానే సంతోషించినవారిలో మమతా బెనర్జీ ముఖ్యులు. కానీ మ్యాచ్‌రద్దు విషయంలో తమ ప్రభుత్వానికి ఒక్కమాటకూడా చెప్పక పోవడంపై ఆమెకి కోపం వచ్చింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/