కార్యకర్తలకు టీ చేసి ఇచ్చిన సిఎం

Mamata-Banerjee
Mamata-Banerjee

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ ఎప్పుడు కూడా చాలా సాదా సీదాగా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఆమె బుధవారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో దిఘాలోని దత్తాపూర్‌లోని ఓ చిన్న టీ దుకాణం వద్ద ఆగారు. కారు దిగి ఆ దుకాణంలోకి వెళ్లారు. దుకాణదారుతో కాసేపు ముచ్చటించి ఆమె స్వయంగా తన పార్టీ కార్యకర్తలకు టీ పెట్టి ఇచ్చారు.సీఎం చేసిన ఆ పనికి ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతైంది. దుకాణం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంతో సెక్యూరిటీ అక్కడకు చేరుకున్నారు. సెక్యూరిటీని దుకాణం వద్దకు రావద్దని చెప్పి అక్కడున్న వారితో కాసేపు మాట్లాడిన అనంతరం సీఎం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ వీడియోను మమత తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.’చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని ఆనంద పరుస్తాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చి వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా… ఆమె ఉదాసీనతను చూసి అక్కడున్నవారంతా ఫిదా అయిపోయారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/