ఈ బిల్లును తాము సమర్ధించేది లేదు

 కశ్మీర్‌లో శాంతిని పునరుద్ధాల్సిన అవసరం ఉంది

Mamata Banerjee
Mamata Banerjee

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ సిఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కశ్మీర్‌ ఆర్టికల్‌ 370 అధికరణపై తొలిసారి స్పందించారు. ఈ బిల్లును తాము సమర్ధించేది లేదని ఆమె తెలిపారు. బిల్లుపై ఓటు కూడా వేయమని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, కశ్మీరీలతో ప్రభుత్వం చర్చించాలని, కశ్మీర్‌కు శాశ్వత పరిష్కారం కోరుకుంటే ముందు ఆ అంశంతో ముడిపడిన భాగస్వామ్య పక్షాలతో చర్చంచాలని సూచించారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ ఆమె డిమాండ్ చేశారు. కశ్మీర్‌లో శాంతిని పునరుద్ధాల్సిన అవసరం ఉందని మమత చెప్పారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/