మోడిని సాగనంపేందుకు పొత్తులు కుదిరాయి

Mamata Banerjee
Mamata Banerjee

రాయిగంజ్‌: పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ రాయిగంజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతు కేంద్ర సర్కార్‌ ఏర్పాటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు. ఎన్నికల తర్వాత పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశాలున్నాయన్నారు. అయితే ప్రధాని మోడిని సాగనంపేందుకు అన్ని రాష్ర్టాల్లోనూ పొత్తులు కుదిరాయని, మోడిని గద్దెదింపిన తర్వాత, నవ భారత నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని మమతా బెనర్జీ అన్నారుకాగా బిజెపి ఎదగడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. బీజేపీకి ధీటుగా కాంగ్రెస్‌ పోరాటం చేయలేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీ పుంజుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ఆ పార్టీ ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/