అసదుద్దీన్‌ ఒవైసీపై మమతా బెనర్జీ విమర్శలు

Mamata Banerjee
Mamata Banerjee

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గోన్న మమతా బెనర్జీ హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై విమర్శలు చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తోన్న ఏఐఎంఐఎం పార్టీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టింస్తోందని, ఇటువంటి శక్తులను నమ్మకూడదని మైనార్టీలను కోరారు. ఇంకా ఏఐఎంఐఎం పార్టీని అతివాద పార్టీగా ఆమె అభివర్ణించారు. అలాగే, హిందూ అతివాద శకుల పట్ల కూడా ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా 2011 నుంచి పశ్చిమ బెంగాల్‌ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్నా విషయం తెలిసిందే. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా గెలవాలని బిజెపి ప్రయత్నాలు జరుపుతుండడంతో టీఎంసీ కూడా ఇప్పటి నుంచే తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/