ప్రశాంత్‌ కిశోర్‌కు మమతా బెనర్జీ పిలుపు

ఢిల్లీ నుంచి కోల్ కతా చేరుకున్న ప్రశాంత్ కిశోర్

Mamata Banerjee - Prashant Kishor
Mamata Banerjee – Prashant Kishor

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ న్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు అత్యవసర పిలుపున్చిచారు. దీంతో ఆయన ఓ కార్గో విమానంలో కోల్ కతాకు చేరుకున్నారు. అయితే కరోనా వైరస్‌ కట్టడి చేయడంలో మమత ప్రభుత్వం విఫలమైందని బిజెపి విమర్శిస్తుండటం, కేంద్ర అధ్యయన బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ఏర్పడిన సంక్లిష్టత తదితరాల నేపథ్యంలో ప్రశాంత్ సలహాలు తీసుకోవాలని మమత భావించినట్టు తెలుస్తోంది. కరోనా విషయంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టే విషయాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తారని సమాచారం. కాగా ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ కు తనవంతు సహకారాన్ని అందిస్తూ, రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్న ఇస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/