తొలి ‘డే అండ్ నైట్ మ్యాచ్’ కు విశిష్ట అతిథులు

అతిథులుగా హాజరుకానున్న బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, బెంగాల్ సీఎం మమత

Mamata Banerjee and Sheikh Hasina
Mamata Banerjee and Sheikh Hasina

కోలకతా: భారత క్రికెట్ జట్టు తొలిసారిగా ఆడే ‘డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్’ కు విశిష్ట అతిథులు హాజరు కానున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే భారత్బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ కు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో పాటు పశ్బిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్ కర్ హాజరు కానున్నారు. ఈ మేరకు వివరాలను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అభిషేక్ దాల్మియా తెలిపారు. మ్యాచ్ ప్రారంభ రోజున పలు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వీటిని మమత, హసీనాలు ప్రారంభిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా హాజరుకానున్న క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, ఒలింపిక్ ఘూటింగ్ విజేత అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ లను బెంగాల్ క్రికెట్ సంఘం(బీసీఏ) సన్మానించనుందని చెప్పారు. 2000వ సంవత్సరంలో బంగ్లా జట్టు భారత్ లో పర్యటిస్తున్న సమయంలో ఇక్కడ జరిగిన మ్యాచ్ సందర్భంగా బీసీఏ పలువురు క్రీడాకారులను సన్మానించిందని, ఈ మ్యాచ్ ద్వారానే స్థానిక ఆటగాడు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టు కెప్టెన్ గా మారాడని వెల్లడించారు. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచులు పింక్ బంతులతో ఆడతారని చెప్పారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/