మాల్యాను ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటన

malya as Fugitive Economic Offender
malya as Fugitive Economic Offender

ముంబై: బ్యాంకు రుణాల ఎగవేతదారు విజ§్‌ు మాల్యాను పరారైన ఆర్దిక నేరస్థుడిగా కోర్టు ప్రకటించింది. పరారైన ఆర్ధిక నేరస్థుల చట్టం, 2018 ప్రకారం ఈ విధంగా నేరస్థుడిగా ప్రకటించబడిన మొదటి వ్యాపారవేత్త మాల్యాయే. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కోర్టు శనివారం ఈ తీర్పు చెప్పింది. ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌ (ఈడి) విజ్ఞప్తి మేరకు ఈ ప్రకటన చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం మాల్యాకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసే అధికారం ఉంటుంది. ఆర్థిక నేరాలను అడ్డుకోవాలనే ఉద్ధేశ్యంతో ఆగస్టులో ఒక కొత్త చట్టాన్ని రూపొందించింది. వంద కోట్ల కన్నా ఎక్కువ ఆర్థిక నేరానికి పాల్పడి, పరారీలో ఉన్న వ్యక్తిని మోస్ట్‌ వాంటెడ్‌ ఆర్థిక నేరగాడిగా పరినణించాలని ఫిజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్స్‌ యాక్టు 2018 పేర్కొన్నది. ఐతే ఈ చట్టం భారీ ఆర్ధిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పరారైన వ్యక్తిని పట్టుకొచ్చేందుకు తయారు చేశారు.