ఇకనుండి ముంబయిలో రాత్రింబవళ్లూ దుకాణాలు

aditya thackeray
aditya thackeray

ముంబయి : ఇకనుండి ముంబయిలో దుకాణాలు రాత్రింబవళ్లూ తెరిచే ఉంటాయి. ఈ దిశగా రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం ఈ నెల 26వ తేదీనుంచి అమల్లోకి రానున్నది. మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే ఇటీవల షాపింగ్‌ మాల్స్‌, హొటల్స్‌, రెస్టారెంట్ల అధిపతులతోనూ, హొటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ ఇండియా (హెచ్‌ఆర్‌ఎడబ్ల్యుఐ) ప్రతినిధులతోనూ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలోముంబయి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ పర్దేశీ, పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ బార్వే, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం హెచ్‌ఆర్‌ఎడబ్ల్యుఐ అధ్యక్షుడు గురుబక్షీస్‌ సింగ్‌ కొహ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/