బిల్‌గేట్స్‌ను కలిసిన బాలివుడ్‌ నటీ

bill gates & mallika sherawat
bill gates & mallika sherawat

ముంబయి: ప్రముఖ బాలివుడ్‌ నటి మల్లికా శెరవాత్‌ ఇటీవల మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిశారు. గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి ఇటీవల వాషింగ్టన్‌లో ఆమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఏర్పాటు చేసిన ఒక పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీలో భాగంగా ఆమె బిల్‌గేట్స్‌ను కలిసి..మహిళా సాధికారిత గురించి చర్చించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా పోస్టు చేశారు. బిల్‌గేట్స్‌ను కలిసి మహిళా సాధికారత గురించి మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించిందని మళ్లికా తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/