న్యూయార్క్‌ లో భారీ అగ్ని ప్రమాదం ..19 మంది సజీవదహనం

అమెరికాలోని న్యూయార్క్‌ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌ మెంట్‌ లో చెలరేగిన మంటలు 19 మందిని బలితీసుకున్నాయి. వీరిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈస్ట్‌ 81 స్ట్రీట్‌ లోని 19 అంతస్తులున్న బ్రాంక్స్‌ ట్విన్‌ పార్క్‌ అపార్ట్‌మెంట్‌ ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

భవనంలోని రెండు, మూడో అంతస్తుల్లోని డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నారు. 60 మంది వరకు గాయపడగా..ప్రస్తుతం వారు హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటన సమాచారం తెలుసుకోగానే దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ.. న్యూయార్క్ నగరంలో మేము ఇక్కడ చూసిన అత్యంత ఘోరమైన అగ్నిప్రమాద సంఘటనలలో ఇది ఒకటి. న్యూయార్క్ నగరానికి ఇది భయానక మరియు బాధాకరమైన క్షణం అని కూడా అన్నారు. మరోవైపు, అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.