మలేషియా మాజీ ప్రధానికి 12 ఏళ్లు జైలు శిక్ష

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ నజీబ్ రజాక్

malaysian-ex-pm-najib

కౌలాలంపూర్‌: మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు 12 సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ, కోర్టు తీర్పును వెలువరించింది. అధికారంలో ఉండి భారీఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన కేసుల్లో తీర్పు వెలువడింది. అవినీతి ఆరోపణలతోనే రెండేండ్ల క్రితం ఆయన అధికారం కోల్పోయారు. మాలే పార్టీనుంచి రజాక్‌ను బహిష్కరించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీయే మళ్లీ అధికారంలోకి వచ్చింది. రజాక్‌ తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పెట్టుబడి సంస్థనుంచి 49.4 మిలియన్‌ డాలర్లను దారిమళ్లించి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ కేసులో న్యాయమూర్తి మొహమ్మద్‌ నజ్లాన్‌ ఘజాలి తీర్పు వెలువరించారు. అధికార దుర్వినియోగానికి 12 ఏండ్లు, మూడు నేరపూరిత కార్యకలాపాలకు 10 ఏండ్ల చొప్పున, మూడు మనీ లాండరింగ్‌ నేరాలకు 10 ఏండ్ల చొప్పున శిక్ష విధించారు. అయితే, మొత్తం 12 ఏండ్లు శిక్ష అనుభవిస్తే సరిపోతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇంకా నాలుగు కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/