చిత్రసీమలో మరోవిషాదం : గుండెపోటుతో సీనియర్ నటుడు కన్నుమూత

చిత్రసీమలో వరుస మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో ప్రతి రోజు ఎవరొకరు వివాద కారణాలతో మరణిస్తున్నారు. తాజాగా నిన్న శుక్రవారం సీనియర్ నటులు వీపీ ఖలీద్‌ (70) గుండెపోటుతో మరణించారు. వయక్కం సమీపంలో ఓ సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న ఖలీద్.. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. ఎంతసేపటికి తిరిగిరాకపోయేసరికి, షూటింగ్ సిబ్బంది ఆయన్ని పిలవడానికి వెళ్లగా అక్కడే అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే యూనిట్ ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

వీపీ ఖలీద్‌ మొదట్లో సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసినా ఆ తర్వాత కొన్ని సీరియల్స్ తో ఆయనకి మంచి పేరు వచ్చింది. దీంతో సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆయనకు ముగ్గురు కుమారులు షైజు, జింసీ, ఖలీద్‌ రెహమాన్‌. వీరు ముగ్గురూ కూడా ఫిలిం ఇండస్ట్రీలోనే వేరు వేరు విభాగాల్లో రాణిస్తున్నారు. వీపీ ఖలీద్‌ మరణంతో మలయాళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.