మలై పన్నీర్‌

 Malai Pannir
Malai Pannir

కావలసిన పదార్థాలు
పన్నీర్‌ ముక్కలు – 600 గ్రాములు
ఉల్లిపాయలు – రెండు
అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్‌లు
కారం – ఒక టీస్పూన్‌
కొత్తిమీర పొడి – ఒక చెంచా
పసుపు – అరచెంచా
ఉప్పు-తగినంత
మీగడ – అరకప్పు
నూనె – అరకప్పు
తయారుచేయు విధానం
ముందుగా బాణలిలో నూనె వేయాలి. తురిమిన ఉల్లిపాయల్ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం, వెల్లుల్లి ముద్ద, కారం, కొత్తిమీర పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి. అయిదు నిమిషాల పాటు వేయించాలి. తరువాత పన్నీర్‌ ముక్కలు వేసి మసాలా వాటికి బాగా పట్టే వరకు కలపాలి. చివరగా మీగడ వేసి రెండు నిమిషాల పాటు కలపాలి. వేడిగా వడ్డించాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/