క్యారెట్‌ సలాడ్‌

CARROT SALAD

కావలసిన పదార్థాలు

ఒక మాదిరి సైజు చిలకడదుంప
రెండు క్యారెట్లు స్లైసులుగా కట్‌ చేయాలి.
టమాటాలు – ఎనిమిది
పది తోటకూర ఆకులు
75 గ్రాముల లేత బఠానీ గింజలు
ఒక స్పూన్‌ తేనె
ఆరు స్పూన్లు పెరుగు
ఒకటన్నర స్పూన్లు ఉప్పు
ఒక స్పూన్‌ మిరియాల పొడి

తయారు చేయు విధానం

చిలకడ దుంప చెక్కుతీసి ముక్కలుగా కోయాలి. మెత్తబడే వరకు ఉడకనిచ్చి మంట తీసేసి మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారెట్‌ ముక్కలను కరకరలాడే విధంగా కొద్దిసేపు ఉడికించాలి.
వీటిని చిలకడదుంపల ముక్కలతో కలిపి నీటిని ఒంపేయాలి. రెండింటినీ కలిపి బౌల్‌లో ఉంచుకోవాలి.
గింజలు తీసేసిన టమాటాలు పై భాగాన్ని ముక్కలుగా కోయాలి. తోటకూర ఆకుల్ని, చిలకడదుంప, క్యారెట్‌, టమాటా ముక్కల్ని బఠాణీలను కలుపుకోవాలి.
తేనె, పెరుగు, మిరియాలపొడులను గిలకొట్టి కలపాలి.
అర్కోట్‌ పప్పులు, ఉల్లిపాయ, చక్రాలతో అలంకరించాలి.
ఈ మిశ్రమాన్ని సలాడ్‌పై పోయాలి. లేదా విడిగా బౌల్‌లో సర్వ్‌ చేయాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/