పైనాపిల్‌ నెయిల్స్‌

అందమే ఆనందం

pineapple nail painting

పండ్లలో పైనాపిల్‌ రుచికి ఫిదా అంటుంటారు చాలామంది. ముక్కలుగా కోసుకుని పంచదార చల్లుకుని తినేవాళ్లు కొందరైతే పాలు, తేనె కలుపుకుని జ్యూస్‌ చేసుకునేవాళ్లు ఇంకొందరుఅంత ప్రీతిపాత్రమైన అనాస అందాన్ని మీ గోళ్లపైన కూడా చిత్రించుకోండి. ఇంకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.

ముందుగా నెయిల్స్‌ క్లీన్‌ చేసుకొని షేప్‌ చేసుకోవాలి. తర్వాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్‌ వరెంట్‌ కలర్‌ వేసుకుని ఆరనివ్వాలి. ఇప్పుడు పింక్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ లేదా మీకు నిచ్చిన నెయిల్‌ కలర్‌ తీసుకుని ఇన్ని నెయిల్స్‌కి అప్లై చేసుకోవాలి.

అనంతరం గ్రీన్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసు కుని సన్నని బ్రష్‌తో కుడివైపుకు మూడుగీతలు, ఎడమవైపుకు మూడు గీతలు వచ్చేలా ఆకులనుడిజైన్‌ చేసుకోవాలి.

ఇప్పుడు గ్రీన్‌ కలర్‌లో నెయిల్‌ పాలిష్‌ తీసు కుని..సనన్నని బ్రష్‌తో ఆకులకు ఎల్లో కలర్‌ అనాస పండుకు మధ్య నుంచి మొదలు పెట్టి ఎడవ, కుడి వైపులకు బర్డర్‌ డిజైన్‌ చేసుకోవాలి.

తర్వాత ఎల్లో కలర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసుకుని. సన్నని బ్రష్‌ ఉపయోగించి.. గ్రీన్‌ కలర్‌ ఆకులకు అటాచ్‌ అయ్యేలా మొదలుపెట్టి గోరు మొదలు వరకూ అనాన షేప్‌లో డిజైన్‌ వచ్చేలా చేసుకోవాలి. ఆ భాగమంతా ఎల్లో కలర్‌తో నింపుకోవాలి.

ఇప్పుడు గోల్డ్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసుకుని, సన్నని బ్రష్‌తో గ్రీన్‌ కలర్‌ ఆకులకు, ఎల్లో కలర్‌ అనాస పండుకు మధ్య నుంచి మొదలు పెట్టి ఎడమ,కుడివైపులకు బర్డర్‌ డిజైన్‌ చేసు కోవాలి.

తర్వాత గోల్డ్‌ ర్‌ నెయిల్‌ పాలిష్‌నే ఉపయోగిస్తూ సన్నని బ్రష్‌తో ఎడమ నుంచి కుడివైపు కిందకు సన్నని గీతలు పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే గోల్డ్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ని ఉపయోగిస్తూ సన్నని బ్రష్‌తో
ఇంతకు ముందు డిజైన్‌ చేసుకున్న గీతలకు వ్యతిరేకదిశలో.

కుడి నుంచి ఎడమవైపు కిందకు సన్నని గీతలు పెట్టుకోవాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/