గంగూలీ బిసిసిఐ ప్రెసిడెంట్‌గా రావడం గొప్పగా ఉంది: కోహ్లీ…

Virat Kohil
Virat Kohil

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని గురంచి తనకు మరింత స్పష్టత రావాల్సి ఉందంటూ కొత్తగా బిసిసిఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్‌ గంగూలీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా కెప్టెన్‌ టెస్టులో గెలిచిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ…ధోని క్రికెట్‌ భవిష్యత్తు గురించి గంగూలీ ఇప్పవరకూ నాతో ఏమీ మాట్లాడలేదు. బిసిసిఐ కొత్త అధ్యక్షుడు గంగూలీకి అభినందనలు తెలియజేస్తున్నా. గంగూలీ బిసిసిఐ ప్రెసిడెంట్‌గా రావడం గొప్పగా ఉంది. గంగూలీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నాతో టచ్‌లో ఉంటాడు. నేను ముందుగానే గంగూలీని కలుస్తా. కాకపోతే ఇప్పటివరకూ ధోని గురించి కానీ జట్టు గురించి కానీ గంగూలీ నాతో ఏమీ మాట్లాడలేదని కోహ్లీ తెలిపాడు. అక్టోబర్‌ 24వ తేదీన బిసిసిఐ అధ్యక్షుడి హోదాలో ఉండబోతున్న గంగూలీని కలుస్తానని కోహ్లీ పేర్కొన్నాడు. ఒక బిసిసిఐ ప్రెసిడెంట్‌తో ఒక కెప్టెన్‌గా ఏమి మాట్లాడాలో అప్పుడే మాట్లాడతానని అన్నాడు. రాంచీలో మ్యాచ్‌ ముగిసింది కదా. మీరు ధోని ఇంటికి వెళతారా అని ప్రశ్నించగా కోహ్లీ తనదైన శైలిలో జవాబిచ్చాడు. ఈరోజు ఆటలో ధోనినే ఇక్కడకు వచ్చి ఆటగాళ్లను కలిశాడు కదా అని కోహ్లీ బదులిచ్చాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. https://www.vaartha.com/news/national/