మోడి నాయకత్వంలో దేశం ఆ దిశగా అడుగులు వేస్తుంది

Adhir Ranjan Chowdhury
Adhir Ranjan Chowdhury

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడి పై లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి. దేశంలో మహిళపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో అధికారిక గణాంకాల ప్రకారం 2016లో మొత్తం 38,947కేసులు అంటే రోజుకి సుమారుగా 100కుపైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. అన్ని విషయాలపై మాట్లాడే మోడి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మౌనం ఎందుకు వహిస్తున్నారని ఆగ్రహించారు. మోడి నాయకత్వంలో భారతదేశం మేక్‌ ఇన్‌ ఇండియా స్థాయి నుంచి రేప్‌ ఇన్‌ ఇండియా స్థాయికి అడుగులు వేస్తోందని తీవ్రంగా విమర్శించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/