ఉపవాస దీక్షలు ఇంట్లోనే చేసుకోండి
ట్విట్టర్ వేదికగా నారాలోకేష్ సూచన

అమరావతి: ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని చేసే రోజా ఉపవాస దీక్షలను ఇంట్లో ఉండి చేసుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. ట్విటర్ వేదికగా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర ఆరాధనలకు, క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాసం ప్రారంభమైన సందర్బంగా ముస్లిం సోదరులందరికి శుభాకాంక్షలు. రోజా ఉపవాస దీక్షలైనా, నమాజ్లైనా… ఇంట్లోనే నిర్వహించుకోండి. ఇంటిల్లిపాది క్షేమంగా ఉండండి. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/