15న మకరజ్యోతి దర్శనం

శబరిమల పూజారుల స్పష్టీకరణ

Sabarimala
Sabarimala

కేరళ: రెండు రోజుల క్రితం మండల పూజలు ముగిసిన అనంతరం మూసుకున్న కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం తలుపులు రోజు మకర విళక్కు కోసం తెరచుకోనున్నాయి. సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం స్వామి గర్భాలయాన్ని అధికారులు తెరవనున్నారు. ఈ సంవత్సరం జనవరి 15న మకర సంక్రమణం జరుగనున్నందున, ఆ రోజునే మకరజ్యోతి దర్శనం ఇస్తుందని, జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ఆలయ పూజారులు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కోరింది. ఆపై ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు 20వ తేదీ వరకూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/