మధ్యప్రదేశ్‌లో పొంగిపొర్లుతున్న ప్రధాన నదులు


వరదల్లో చిక్కుకుని 32 మంది మృతి

FLOODS
FLOODS

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నదులన్నీ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొం గిపొర్లుతూ వరద పోటెత్తుతుండటంతో ఇప్పటివరకు 32 మంది మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాZషంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మెరుగుపడినప్పటికీ భారీ వర్షాలకు చాలా నదుల్లో నీటిమట్టాలు పెరిగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నర్మద, చంబల్‌, తపతి, పార్వతి, క్షిప్ర, బల్వంతి, అనాస్‌, రూపరేల్‌, సుక్కడ్‌ నదులన్నీ ప్రమాదకరస్థాయిదాటి లేదా ప్రమాదకర స్థాయికి సమీపంలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లు తున్నాయి, దీంతో అధికారవర్గాలు మధ్యప్రదేశ్‌ రాZషంలోని 28 డ్యామ్‌లకు చెందిన ఏడు స్లూయీస్‌ గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులు తున్నారు. ఈ డ్యామ్‌లలో ఖాడ్వాలోని ఓంకార్వేర్‌ డ్యామ్‌, గునాలోని కృష్ణసాగర్‌ డ్యామ్‌, జబల్‌పూర్‌లోని బర్గీడ్యామ్‌, ధార్‌లోని మహి డ్యామ్‌, భోపాల్‌లోని భడ్‌ భడా డ్యామ్‌లు ఉన్నాయి. రాZషంలోని 52 జిల్లాల్లోని భోపాల్‌ సహా 13 జిల్లాల్లో సాధారణస్థాయికి మించి వర్ష పాతం నమోదు కాగా, మిగిలిన 28 జిల్లాల్లో ఈ నెల ప్రారంభం నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. శుక్రవారం సా యంత్రం బద్నావర్‌వద్ద ఉన్న బల్వంతి నదిలో నీటి ఉదృతికి తొమ్మిదేళ్ల బాలుడు కొట్టు కుపోయాడని ధార్‌జిల్లా నుంచి అందిన సమాచారం మేరకు తెలిసింది. అయితే కొన్ని గంటల తర్వాత ఆ ప్రాంతానికి కిలోమీటర్‌ దూరంలో బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు.

పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌ జిల్లాలోని రూపరేల్‌ నదికి వచ్చిన వరదల్లో మరో వ్యక్తి కూడా కొట్టుకుపోయాడని, అయితే అతడి జాడ ఇంత వరకు తెలియలేదు. ఇదిలా ఉండగా బర్వాని జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ ఉప్పునీటి కయ్యల వద్ద నీట మునిగే జోన్‌లో ఉన్న 10 గ్రామాలకు చెందిన 85 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శుక్ర వారం తొలిసారిగా గుజరాత్‌కు సమీపంలో ఉన్న సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ గేట్లు తెరిచి నీటిని వదిలారు. అలాగే రాZషంలోని బర్వాని జిల్లాలోని నర్మద నదిలోని నీటి మట్టాన్ని తగ్గించారు. జబల్‌పూర్‌, ఖాండ్వా జిల్లాల్లోని బర్గీ, ఓంకారేశ్వర్‌ డ్యామ్‌ల స్లూయిస్‌ గేట్లను ఎత్తివేసి నీటిని వదిలినప్పటికీ ప్రాజెక్టు ప్రాంతంలో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. రాZషంలోని ఇతర ప్రాంతాల్లోని డ్యామ్‌ల నుంచి నీటి విడుదల చేస్తున్న దృష్టి నర్మద నదీతీరం కొట్టుకుపోయే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో అనేది అధికార యంత్రాంగం పరిశీలిస్తు నదని బర్వానీ జిల్లా కలెక్టర్‌ అమిత్‌ తోమర్‌ అన్నారు. కాగా, చంబల్‌ నదికి వచ్చిన వరదల కారణంగా అం దులో భాగంగా మందసౌర్‌ జిల్లాలో వరద పరిస్థితి తెలుసుకునేందుకు రాZష రెవెన్యూ మంత్రి గోవింద్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఏరియల్‌ సర్వే చేశారు.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/