సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం

టాక్స్ టైల్స్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం..ఘటనా స్థలానికి చేరుకున్న 57 ఫైర్‌ ఇంజన్లు

fire-accident
fire-accident

సూరత్‌: గుజరాత్ రాష్ట్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూరత్‌లో రఘుబీర్ టాక్స్ టైల్స్ మార్కెట్‌లో ఈరోజు తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో…. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 57 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్నిఅదుపు చేస్తున్నాయి. సుమారు రెండు వందలమంది సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ అగ్నిప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగలు అలుముకున్నాయి. దీంతో అక్కడ నివసిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/