24 యేళ్ల తర్వాత పట్టుబడిన దావూద్‌ అనుచరుడు మాజిద్‌

కారులో వెళుతుండగా చాకచక్యంగా వలపన్ని పట్టుకున్న పోలీసులు

Majid, a follower of Dawood arrest
Majid, a follower of Dawood arrest


Gujarat: గ్యాంగ్‌స్టర్‌ అండర్‌వరల్డ్‌ మాఫియా డాన్‌దావూద్‌ ఇబ్రహీం ముఠా సభ్యుడు కీలక వ్యక్తి అబ్దుల్‌ మాజీద్‌ కుట్టిని గుజరాత్‌ యాంటి టెర్రరిజం స్క్వాడ్‌ అదుపులోకినికి తీసుకుంది. మాంగో పోలీస్‌స్టేషన్‌ పరిసరాల్లోనే ఆతని కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఎటిఎస ్‌పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

గడచిన 24 ఏళ్లుగా మాజిద్‌ తప్పించుకుని తిరుగుతున్నాడు. గుజరాత్‌, మహారాష్ట్రల్లో 1997 రిపబ్లిక్‌డే రోజున పేలుళ్లు జరపాలని దావూద్‌ ఇబ్రహీం ఆదేశాలమేరకు దావూద్‌నుంచి ఆయుధసామగ్రిని తీసుకున్నాడని, పేలుళ్లకు కుట్రచేసాడన్న కేసు మాజిద్‌పై నమోదయింది.

పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్నా తప్పించుకుని మలేసియాకు పరారయ్యాడు. గుజరాత్‌లోని మెహసానాలో నాలుగు కిలోల ఆర్‌డిఎక్‌.,115 పిస్టళ్లు, 750 క్యాట్రిడ్జ్‌లు పది డిటోనేటర్లు తీసుకెళుతుండగా పట్టుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసారు. గుజరాత ్‌ఎటిఎస్‌ స్క్వాడ్‌ గత శుక్రవారం ఉదయమే నగరానికి చేరుకుని కమాల్‌ ఆచూకీ కోసం ఆరా తీసారు. మహ్మద్‌ కమల్‌, ఆతని కుమారుడు హరూన్‌ రషీద్‌లను అదుపులోకి తీసుకున్నారు.

అమాంగో చౌక్‌వద్ద ఎటిఎస్‌స్కాడ్‌ మాజిద్‌కారును పట్టుకున్నారు. మలేసియా, దుబాయి, బాంకాక్‌లలో ఉంటూ తరచూ వచ్చిపోతున్న మాజిద్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు. పాస్‌పోర్టు ఎండి కమాల్‌ పేరిట సాధించాడు. సహారాసిటీలో మాజిద్‌కుట్టి తల దాచుకుంటున్నట్లు తెలిపారు.

పేరు మార్చుకుని కమాల్‌గా చెపుతున్నట్లు ఎస్‌ఎస్‌పి డా.ఎం తమిళ్‌వానన్‌ తెలిపారు. కేరళ వాసి అయిన కుట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. అహ్మదాబాద్‌,ముంబయి నగరాలకు మకాం మార్చాడు.

ఆయుధ సామగ్రిని రాజస్థాన్‌లోని బార్మర్‌ సరిహద్దు ద్వారా భారత్‌కు రప్పించి అహ్మదాబాద్‌, ముంబయికి చేరవేసేవాడని తేలింది. సహారా సిటీ కాంప్లెక్స్‌లో ఆతనికి డూప్లెక్స్‌ బంగ్లా ఉంది. ఫోర్డుకారులో వెళుతుండగా పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/